ఇది భరించలేని చెత్త వైరస్‌

23 Mar, 2020 12:44 IST|Sakshi

కరోనా వైరస్‌ ప్రభావాన్ని జోక్‌గా తీసుకోవద్దు

2012 ఒలింపిక్‌ స్మిమ్మింగ్‌ చాంపియన్‌ కామెరూన్‌

కేప్‌టౌన్‌:  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా,  ఆ మరణాల సంఖ్యలో ఇటలీలో తీవ్రంగా ఉంది. దీని ప్రభావం ఆఫ్రికా దేశాల్లో తక్కువగా ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా దిగ్గజ స్విమ్మర్‌ కామెరూన్‌ వాన్‌ డెర్‌ బర్గ్‌ దీని బారిన పడ్డాడు.  కోవిడ్‌-19 సోకడంతో ఇప్పటివరకూ 14 రోజులపాటు చికిత్స తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కామెరూన్‌.. కరోనా వైరస్‌ అనుభవాన్ని పంచుకున్నాడు. తన జీవితంలో చూసిన వైరస్‌ల పరంగా చూస్తే ఇది భరించలేని ఒక చెత్త వైరస్‌ అని పేర్కొన్నాడు. 31 ఏళ్ల వయసులో ఈ వైరస్‌ బారిన పడిన తాను మెల్లగా కోలుకున్నట్లు పేర్కొన్నాడు. (భారత్‌లో 8కి చేరిన కరోనా మరణాలు)

‘ఇప్పటివరకూ నా శరీరాన్ని భరించలేనంతగా ఇబ్బంది పెట్టిన వైరస్‌ ఏదైనా ఉందంటే అది కరోనా వైరస్‌. ఇది చాలా చెత్త వైరస్‌. నాకు ఎటువంటి పొగత్రాగే అలవాట్లు లేకుండా నా ఊపిరితిత్తులు ధృడంగా ఉన్నా కూడా ఇది  చాలా ఇబ్బంది పెట్టింది. ఆరోగ్యకరమైన నా జీవన విధానంలో ఇది నన్ను అతాలాకుతలం చేసింది.  తీవ్రమైన జ్వరం తగ్గినప్పటికీ, నేను ఇంకా అధిక అలసటతో పాటు పొడి దగ్గుతో బాధపడుతున్నాను. నడిస్తే చాలు శారీరకంగా అలసిపోతున్నాను. కరోనా బారిన పడి అథ్లెట్లు ఎవరైనా ప్రస్తుతం మనకున్న శారీరక పటుత్వాన్ని కోల్పోతమనే అనిపిస్తోంది. ’ అని వాన్‌ డెర్‌ పేర్కొన్నాడు.  2012 ఒలింపిక్స్‌లో పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ విభాగంలో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన వాన్‌ డెర్‌.. 2018లో స్మి​మ్మింగ్‌కు గుడ్‌ బై చెప్పాడు. (కరోనాపై చైనా గెలిచిందిలా..!)

మరిన్ని వార్తలు