ఓ పట్టుపట్టి స్వర్ణం సాధించింది

16 Jul, 2018 08:46 IST|Sakshi

మాడ్రిడ్‌: గ్రాండ్‌ ప్రిక్స్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ సత్తా చాటింది. మాడ్రిడ్‌ వేదికగా జరుగుతున్న రెజ్లింగ్‌ క్రీడలో (50 కేజీల విభాగం) కెనెడాకు చెందిన నటాషా ఫాక్స్‌ను.. వినేశ్‌ 10-0 తేడాతో చిత్తు చేసింది. ఆరంభం నుంచే బౌట్‌లో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన వినేశ్‌.. చివరకు విజేతగా నిలిచింది. కాగా, 23 ఏళ్ల వినేశ్‌.. గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.  స్పానిష్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో తొలి గేమ్‌ నుంచే సత్తా చాటుతూ వస్తోంది. కాగా, తాజా విజయంతో వచ్చే నెలలో జరగబోయే ఏషియన్‌ గేమ్స్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతానని ఆమె తెలిపింది.  ఈ టోర్నీ కోసం తనకు కోచ్‌గా వ్యవహరించిన వోల్లర్‌ అకోస్‌(హంగేరి)ని.. పర్సనల్‌ ట్రైనర్‌గా ఇండియాకు రావాల్సిందిగా వినేశ్‌ ఆహ్వానించింది. ఇదిలా ఉంటే  ఆగష్టు 18 నుంచి జకార్త, పాలెంబ్యాంగ్‌లో ఏషియన్‌ గేమ్స్‌ జరగనున్నాయి.  

మరిన్ని వార్తలు