విజేతలు అబ్దుల్ ఖాదర్, రహీమ్

8 Nov, 2016 10:48 IST|Sakshi

రెజ్లింగ్ చాంపియన్‌షిప్


హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అబ్దుల్ ఖాదర్, రహీమ్ విజేతలుగా నిలిచారు. ఫలక్‌నుమా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో సీనియర్ విభాగంలో అబ్దుల్ ఖాదర్, జూనియర్ విభాగంలో రహీమ్, సబ్ జూనియర్ విభాగంలో రూప్‌లాల్, ఓపెన్ కేటగిరిలో సారుుదీప్ చాంపియన్లుగా నిలిచారు. మొత్తం ఈ టోర్నమెంట్‌లో 210మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

 

సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి ప్రత్యక్షంగా వీక్షించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి నారుుని నర్సింహా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేసి గదతో సత్కరించారు.
 

ఈ పోటీల్లో పాల్గొన్న పోలీస్ రెజ్లర్లు ఎం.సంతోష్, వీరేష్, మహేష్‌లకు గోల్డ్ మెడళ్లను బహుకరించారు. రెజ్లింగ్‌లో సత్తా చాటిన పహిల్వాన్లకు స్పోర్‌‌ట్స కోటా కింద ఉద్యోగాలను ఇప్పించేందుకు కృషిచేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ బాబురావు, ఫలక్‌నుమా ఏసీపీ మొహమ్మద్ అబ్దుల్ బారీ, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, శాలిబండ, ఫలక్‌నుమా డివిజన్ల ఇన్‌స్పెక్టర్లు, అదనపు ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు