'కెప్టెన్సీ తీసుకుని తప్పు చేశా'

26 Oct, 2014 20:30 IST|Sakshi

కరాచీ: కెప్టెన్సీ తీసుకోవడం తన కెరీర్లో చేసిన తప్పని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ అన్నాడు. 2007 ప్రపంచ కప్ అనంతరం పాక్ కెప్టెన్గా షోయబ్ను కెప్టెన్గా నియమించారు.

జట్టు పగ్గాలు స్వీకరించకుంటే తన కెరీర్ మెరుగ్గా ఉండేదని పెదవి విరిచాడు. అయితే తాను స్వార్థంగా ఆలోచించకపోవడం వల్లే కెప్టెన్ బాధ్యతలు చేపట్టానని షోయబ్ చెప్పాడు. తాను కెప్టెన్ అయినపుడు యువకుడినని, దీంతో కొందరు సీనియర్ ఆటగాళ్లుతో సరిగా వ్యవహరించేవారు కాదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 2007 ప్రపంచ కప్లో పాక్ ఘోరంగా విఫలమైంది. అప్పటి పాక్ కోచ్ బాబ్ ఊమర్ హోటల్లో మరణించాడు. అనంతరం అప్పటి కెప్టెన్ ఇంజమామ్ పాక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షోయబ్ పాక్కు సారథ్యం వహించాడు. అయితే షోయబ్ ప్రస్తుతం ఫామ్లేమితో సతమతమవుతున్నాడు.

మరిన్ని వార్తలు