ఆ పోలిక విరాట్కు వద్దే వద్దు..

15 Dec, 2016 12:58 IST|Sakshi
ఆ పోలిక విరాట్కు వద్దే వద్దు..

ముంబై:ఇప్పటికే క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తిరగరాసిన భారత స్టార్ విరాట్ కోహ్లిని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పోల్చుతుంటే, అసలు ఆ పోలిక వద్దే వద్దే అంటున్నాడు ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్కాట్. ఏవో కొన్ని రికార్డులను ఒక ఆటగాడు లిఖించినంత మాత్రానా, దిగ్గజ ఆటగాళ్లతో విరాట్ను పోల్చడం ఎంతమాత్రం సమంజసం కాదంటున్నాడు. దాంతో పాటు విరాట్ కోహ్లి క్రికెట్లోని అన్ని రికార్డులను బద్ధలు కొడతాడని తాను అనుకోవడం లేదన్నాడు.

ఒకవేళ సచిన్ రికార్డులను కోహ్లి బద్ధలు కొట్టినా, అది ఏమీ పెద్ద విషయమే కాదని బాయ్కాట్ పేర్కొన్నాడు. గత విరాట్ను చూస్తే అతనేమీ పెద్ద గొప్ప ఆటగాడు విషయం అవగతం అవుతుందన్నాడు.  ఈ క్రమంలోనే ఒక ఉదాహరణను జెఫ్రీ తెలిపాడు. గతంలో ఢిల్లీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ రికార్డును తాను బద్ధలు కొట్టిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఆ ఘనతతో తాను సోబర్స్ కంటే అత్యుత్తమ ఆటగాడిగా మారిపోలేదనే విషయాన్ని జెఫ్రీ అంగీకరించాడు. రికార్డులు వస్తూ పోతూ ఉంటాయనే విషయాన్ని మాత్రమే ఇక్కడ గ్రహించాలన్నాడు. ఒకవేళ విరాట్ ఫామ్ కడవరకూ ఇలానే ఉంటే అప్పుడు మాత్రమే అతను గ్రేటెస్ట్ అనే అంశాన్ని నిర్ధారించాలన్నాడు. అంతేకానీ సచిన్ టెండూల్కర్తో విరాట్ను ఇప్పుడు పోల్చడం మాత్రం సరికాదన్నాడు.

మరిన్ని వార్తలు