నువ్వే నాకు స్ఫూర్తి: మంధాన

7 Feb, 2019 11:50 IST|Sakshi

వెల్లింగ్టన్‌: ఇటీవల కాలంలో భారత క్రికెట్‌ జట్టు  మ్యాచ్‌ ఆడిన తర్వాత స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ క్రీడాకారులతో ముచ్చటిస్తున్న సంగతి తెలిసిందే. చహల్‌ టీవీ పేరుతో యాంకర్‌ పాత్ర పోషిస్తూ భారత క్రికెటర్ల ఇంటర్వ్యూలో తీసుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో నాల్గో వన్డే తర్వాత రోహిత్‌ శర్మను ఇంటర్య్యూ చేసే క్రమంలో తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చమంటూ విజ్ఞప్తి చేసిన చహల్‌ అభిమానుల్లో నవ్వులు పూయించాడు. నాల్గో వన్డేలో భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచిన చహల్‌.. కోహ్లి స్థానంలో తనను పంపాలంటూ రోహిత్‌ను ఇంటర్వ్యూలో అడిగాడు.

ఇదిలా ఉంచితే, తాజాగా భారత మహిళా క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానాను చహల్‌ ఇంటర్య్యూ చేశాడు. ప్రస్తుతం భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మంధానతో ముచ్చటించాడు చహల్‌. న్యూజిలాండ్‌ మహిళలతో జరిగిన తొలి టీ20లో ఓటమి పాలైన తర్వాత మంధానా బ్యాటింగ్‌పై విశ్లేషించాడు. ఈ క్రమంలోనే ‘నా బ్యాటింగ్‌కు నువ్వే స్ఫూర్తి’ అంటూ చహల్‌తో మంధాన జోక్‌ పేల్చారు. తన బ్యాటింగ్‌ను చూసిన ఏమైనా నేర్చుకున్నారా అని చహల్‌ అడగగా, తడుముకోకుండా సమాధానం చెప్పారు మంధాన. ‘ అవును.. నా బ్యాటింగ్‌ తీరుకు నువ్వే స్ఫూర్తి. హామిల్టన్‌లో న్యూజిలాండ్‌ జట్టుపై నువ్వు బ్యాటింగ్ చేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను అప్పుడే నా గేమ్‌ను ఇంకా మెరుగుపరుచుకోవాలనుకున్నా. నేను స్ఫూర్తి పొందే క్రికెటర్లలో నువ్వు ఒకడివి. నేను బ్యాటింగ్‌కు వెళ్లే క్రమంలో నీ ఆట తీరును గుర్తు చేసుకుంటున్నా’ అంటూ మంధాన నవ్వులు పూయించారు.

ఇక్కడ చదవండి: ‘రోహిత్‌.. నా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చు’

మరిన్ని వార్తలు