ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు విరాట్‌ సంపాదనెంతో తెలుసా?

25 Jul, 2018 18:10 IST|Sakshi
విరాట్‌ కోహ్లి ఫైల్‌ ఫోటో

విరాట్‌ కోహ్లి.. ఏ పేరు తెలియని వారే ఉండరు. టీమిండియా కెప్టెన్‌గానే కాకుండా.. సోషల్‌ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే సెలబ్రిటీల్లో ఈయన ఒకరు. కేవలం సోషల్‌ మీడియా పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా.. ఆ పోస్టుల నుంచి కూడా ఆయనకు భారీగా సంపాదన వెల్లువెత్తుతోందట. వినియోగదారులు కొనుగోళ్ల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో ఎల్లప్పుడూ ముందుడే సోషల్‌ మీడియా... అత్యంత చురుగ్గా ఉండే సెలబ్రిటీలను సోషల్‌ మీడియా ప్రభావితదారులుగా వాడుకుంటూ.. భారీగా చెల్లింపులు కూడా చేస్తోంది. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లిని కూడా సోషల్‌ మీడియా ప్రభావితదారుల్లో భాగం చేసింది. 

ఇన్‌స్టాగ్రామ్‌ షెడ్యూలర్‌ హోప్పర్‌హెచ్‌క్యూ విడుదల చేసిన 2018 ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌ లిస్ట్‌ జాబితాలో, ప్రతి ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు ఎవరెంత సంపాదిస్తున్నారో వెల్లడించింది. ఈ జాబితాలో ఆధిపత్య స్థానంలో ఉన్నదెవరో కూడా తెలిపింది. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి 17వ స్థానంలో ఉన్నారట. 17వ స్థానంలో ఉన్న విరాట్‌, ఒక్కో పోస్టుకు లక్షా 20వేల యూఎస్‌ డాలర్లను అంటే సుమారు రూ.82,45,000ను ఆర్జిస్తున్నారని తెలిసింది. విరాట్‌ కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 23.2 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆ‍శ్చర్యకరంగా కోహ్లి, స్టెఫెన్ కరి, ఫ్లాయిడ్ మేవెథర్‌ల కంటే వెనకాలే ఉన్నారని జాబితాలో వెల్లడైంది. అయితే 2018 హోప్పర్‌హెచ్‌క్యూ ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌ లిస్ట్‌లో 10 లక్షల యూఎస్‌ డాలర్లతో కైలీ జెన్నర్ అగ్రస్థానంలో నిలిచారు. క్రిస్టియానో రోనాల్డ్‌, బేవన్స్‌, జాన్సన్‌, జస్టిన్‌ బీబర్‌ వంటి వారు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 

మరిన్ని వార్తలు