లక్ష్య సేన్‌కు రజతం

14 Oct, 2018 01:40 IST|Sakshi

యూత్‌ ఒలింపిక్స్‌

బ్యూనస్‌ ఎయిర్స్‌: స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్‌ యువతార లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. యూత్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఈ ఉత్తరాఖండ్‌ షట్లర్‌ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. ఫైనల్లో లక్ష్య సేన్‌ 15–21, 19–21తో లీ షిఫెంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు. యూత్‌ ఒలింపిక్స్‌ చరిత్రలో రజతం నెగ్గిన రెండో భారతీయ షట్లర్‌గా లక్ష్య సేన్‌ గుర్తింపు పొందాడు. 2010 యూత్‌ ఒలింపిక్స్‌లో ప్రణయ్‌ కూడా రజత పతకమే సాధించాడు.

మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో లక్ష్య సేన్‌ సభ్యుడిగా ఉన్న ‘ఆల్ఫా’ జట్టు స్వర్ణం నెగ్గింది. అయితే ఇది ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌ కావడంతో ఈ ఫలితాలకు, పతకాలకు అధికారిక గుర్తింపు లేదు. మహిళల రెజ్లింగ్‌ 43 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ సిమ్రన్‌ ఫైనల్‌కు చేరింది.  ఫైవ్‌–ఎ–సైడ్‌ పురుషుల హాకీ సెమీఫైనల్లో భారత్‌ 3–1తో ఆతిథ్య అర్జెంటీనా జట్టును ఓడించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.  

 

మరిన్ని వార్తలు