రాష్ట్ర క్రీడాకారులకు పురస్కారాలు 

28 Aug, 2019 06:46 IST|Sakshi

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 29న సత్కారం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో వెల్లడి 

సాక్షి, అమరావతి: ఈనెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా... 2014 నుంచి జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడాకారులను నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. క్రీడా రంగానికి కొత్త శోభను తెస్తామని, ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘క్రీడా రంగానికి కొత్త శోభను తీసుకువస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నెల 29న క్రీడాదినోత్సవం సందర్భంగా 2014 నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తాం. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం’ అని ముఖ్యమంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు