తొలి భారత క్రికెటర్గా యూసఫ్ !

12 Feb, 2017 13:28 IST|Sakshi
తొలి భారత క్రికెటర్గా యూసఫ్ !

వడోదరా:ఒక విదేశీ లీగ్ లో ట్వంటీ 20 లీగ్ లో ఆడేందుకు భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఒప్పందం చేసుకున్నాడు. తద్వారా ఒక విదేశీ లీగ్ లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసఫ్..తన ఫామ్ ను మరింత మెరుగుపరుచునే క్రమంలో విదేశీ లీగ్ తో  ఒప్పందం కుదుర్చుకున్నాడు. వచ్చే నెల 8 వ తేదీన ఆరంభమయ్యే ఈ లీగ్ లో తాను  పాల్గొనబోతున్న విషయాన్ని యూసఫ్ స్వయంగా వెల్లడించాడు.

 

'హాంకాంగ్ ట్వంటీ 20 లో పాల్గొనేందుకు సంతకం చేశా. ఆ లీగ్ లో చాలా మంది ప్రముఖ క్రీడాకారులు ఆడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నా. దాంతో ఆ లీగ్ తో ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వెళ్లా. ఇలా ఒక విదేశీ లీగ్ తో ఒప్పందం చేసుకోవడానికి ఐపీఎల్లే ప్రధాన కారణం. ఐపీఎల్ కు మంచి ప్రాక్టీస్ లభిస్తుందనే ఉద్దేశంతోనే విదేశీ లీగ్ తో ఒప్పందం చేసుకున్నా' అని యూసఫ్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఈ లీగ్ లో పాల్గొనడం తన దేశవాళీ కెరీర్ పై ఎటువంటి ప్రభావం చూపదని యూసఫ్ పేర్కొన్నాడు.

 

దాదాపు ఐదేళ్ల క్రితం భారత తరపున యూసఫ్ ఆడాడు. 2012లో చివరిసారి భారత్ కు యూసఫ్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయిన యూసఫ్..కేవలం దేశవాళీ టోర్నీలకు మాత్రమే పరిమితమయ్యాడు.
 

>
మరిన్ని వార్తలు