వేణుమాధవ్‌ మృతి.. టీమిండియా క్రికెటర్‌ ట్వీట్‌

27 Sep, 2019 13:08 IST|Sakshi

హాస్య నటుడు వేణుమాధవ్ మృతిపై టీమిండియా క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు యూసఫ్ పఠాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. వేణుమాధవ్‌ మరణించారన్న వార్త తనను షాకింగ్‌కు గురిచేసిందన్నాడు. సిల్వర్‌ స్క్రీన్‌పై తాను చూసిన అద్భుత హాస్యనటుల్లో అతను ఒకరని పఠాన్‌ తెలిపాడు. వేణుమాధవ్‌ లాంటి హాస్య నటుడిని ఇంకెవరూ భర్తీ చేయలేరన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్విటర్‌ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ వేణు మాధవ్‌కు సంతాపం తెలుపుతున్న సందేశానికి వేణుమాధవ్‌ ఫోటోను జతచేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. 

గుజరాత్‌కు చెందిన పఠాన్‌కు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే తీసిన వేణుమాధవ్‌ గురించి ఎలా తెలుసని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు హిందీలో డబ్‌ అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సై, ఛత్రపతి వంటి చిత్రాలు హిందీ వర్షన్‌లో మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల్లో వేణుమాధవ్‌ తన విలక్షణ కామెడీతో అందరినీ తెగ నవ్వించాడు. దీంతో పఠాన్‌ వేణు మాధవ్‌కు ఫ్యాన్‌ అయ్యాడంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సన్‌రైజర్స్‌ తరుపున పఠాన్‌ ఆడుతుండటంతో వేణుమాధవ్‌ గురించి తెలిసుంటుందని మరికొందరు పేర్కొంటున్నారు.  కాగా, అనారోగ్యంతో మృతిచెందిన వేణుమాధవ్‌ అంత్యక్రియలు గురువారం అభిమానుల అశ్రనయనాల మధ్య ముగిశాయి. వేణమాధవ్‌ మృతిపై టాలీవుడ్‌ లోకం దిగ్భ్రంతిని వ్యక్తం చేసింది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు