యూసుఫ్‌ పఠాన్‌ కేసు పెండింగ్‌లో ఉంది: వాడా 

11 Jan, 2018 00:49 IST|Sakshi

ముంబై: ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) ప్రొటోకాల్‌ ప్రకారం ఆల్‌రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ కేసు పెండింగ్‌లో ఉందని ‘వాడా’ మేనేజర్‌ మాగి డ్యురండ్‌ వెల్లడించారు. అనుకోకుండా నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో పఠాన్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదు నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

గత ఆగస్టు 15 నుంచే అమలైన ఈ సస్పెన్షన్‌ ఈ నెల 14తో ముగియనుంది. వాడా సంస్థ మీడియా రిలేషన్స్, కమ్యూనికేషన్స్‌ మేనేజర్‌ మాగి డ్యురండ్‌ మాట్లాడుతూ ‘ఇది పెండింగ్‌ కేసు. ఇప్పుడు దీనిపై వ్యాఖ్యానించబోం’ అని అన్నారు. అయితే వాడా డోపింగ్‌ కోడ్‌–2015 ప్రకారం తొలిసారి డోపీలకు కేసు తీవ్రతను బట్టి గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది.    

మరిన్ని వార్తలు