రోహిత్‌పై యువరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

5 Apr, 2020 17:13 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మపై మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం యూట్యూబ్‌ చాట్‌ షోలో యువీ పాల్గొన్నాడు. ‘తొలి సారి భారత జట్టుకు ఎంపికైన రోహిత్‌ శర్మను చూశాక అతడికి ఇంకా సమయం ఉందని భావించాను. అతడి కెరీర్‌ తొలి నాళ్లలో నాకు పాకిస్తాన్‌ మాజీ సారథి ఇంజమాముల్‌ హక్‌ను గుర్తుకు తెచ్చాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. బ్యాటింగ్‌ కోసం క్రీజులోకి దిగాక స్ట్రైక్‌ తీసుకోవడం కోసం కొంత సమయం తీసుకుంటారు. బౌలర్లకు కాస్త సమయమిచ్చాకే వారు బ్యాటింగ్‌ చేయడం(పరుగులు రాబట్టడం) మొదలు పెడతారు’అంటూ యువీ వ్యాఖ్యానించాడు. 

కాగా, రోహిత్‌ తన అరంగేట్రపు టీ20 మ్యాచ్‌ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో ఆడాడని కానీ దురదృష్టవశాత్తు అతడికి బ్యాటింగ్‌ రాలేదని యువీ గుర్తుచేశాడు. ఇక ఇదే మ్యాచ్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ ఆరు సిక్సర్లు కొట్టిన విషయయం తెలిసిందే. అరంగేట్రం నుంచి పరిస్థితులకు తగ్గుట్టు ఎప్పటికప్పుడు తన టెక్నిక్‌ మార్చుకుంటూ అసాధరణ ఆటగాడిగా ఎదిగాడని యువీ ప్రశంసించాడు. మూడు ఫార్మట్లలో ఓపెనర్‌గా తన సేవలను అందిస్తున్న రోహిత్‌.. దూకుడైన ఆటతో వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపిస్తున్నాడు.

చదవండి:   
‘నేను కెప్టెన్‌ ఎందుకు కాకూడదు’
‘కోహ్లి జట్టులో ఉంటాడు.. కానీ ధోనినే సారథి’

మరిన్ని వార్తలు