కోహ్లి, బుమ్రాల ‘సిక్స్‌ ప్యాక్‌’పై యువీ కామెంట్‌

22 Aug, 2019 10:43 IST|Sakshi

న్యూఢిల్లీ:  వెస్టిండీస్‌ పర్యటనలో టీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా.. ఇప్పుడు రెండు టెస్టుల సిరీస్‌కు సన్నద్ధమైంది.  గురువారం నుంచి ఆంటిగ్వాలోని సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో తొలి టెస్టు  ఆరంభం కానుంది.  దీనికి ముందు వెస్టిండీస్‌-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.  ఈ మ్యాచ్‌తో భారత్‌కు మంచి ప్రాక్టీస్‌ లభించింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అనంతరం రెండు రోజుల విరామం లభించడంతో విరాట్‌ సేన పూర్తిగా సేద తీరింది.

కెప్టెన్‌ సహా ఆటగాళ్లంతా ఆంటిగ్వా బీచ్‌లో సందడి చేశారు. అయితే విరాట్‌ కోహ్లితో కలిసి సిక్స్‌ ప్యాక్‌ ఫోజిచ్చిన ఫోటోను బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.  దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, వారిలో టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ కూడా చేరిపోయాడు.  వారి సిక్స్‌ ప్యాక్‌కు ముగ్థుడైన యువీ.. ‘ ఓహ్‌.. ఫిట్‌నెస్‌ ఐడల్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. గత కొన్నేళ్లుగా తన ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడూ కాపాడుకోవడమే కాకుండా ఆహార నియంత్రణలో కూడా సహచర ఆటగాళ్లకు కోహ్లి ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం జట్టులోని రెగ్యులర్‌ ఆటగాళ్లంతా కోహ్లినే ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు