ఆఫ్రిదికి సాయం: విమర్శకులపై యువీ ఫైర్‌

1 Apr, 2020 20:12 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియా వేదికగా తనను ఉతికారేస్తున్న విమర్శకులపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మానవత్వానికి సరిహద్దులు అంటూ ఉండవని ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ‘మనకు హానిచేసిన వారు కూడా సాయం కోరితే ఏ మాత్రం ఆలోచించకుండా చేయాలనే కనీస ధర్మాన్ని కొందరు ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్ని దేశాలలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అనేది లభించాలని ఆకాంక్షిస్తూ సందేశాత్మకంగా వివరించాను. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయం నా ఉద్దేశం కాదు. నేను భారతీయుడిని, నా ర​క్తం ఎప్పటికీ నీలమే. అదేవిధంగా ఎల్లప్పుడూ మానవత్వం కోసం నిలబడతాను. జై హింద్‌’అంటూ యువీ ట్వీట్‌ చేశాడు.   

ఇంతకీ అసలు సంగతేంటంటే?
మహమ్మారి కరోనా వైరస్‌ విలయతాండవ చేస్తుండటంతో పాకిస్తాన్‌ ప్రజలు విలవిల్లాడుతున్నారు. అయితే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారికి తన ఫౌండేషన్‌ ద్వారా సాయం చేయాలని పాక్‌ మాజీ సారథి షాహిద్‌ ఆఫ్రిది ముందుకొచ్చాడు. దీనిలో భాగంగా తన ఫౌండేషన్‌ ద్వారా మందులు, ఆహారం అందిస్తున్నాడు. అయితే 'ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయం. ముఖ్యంగా పేదవారు, రెక్కాడితే గాని డొక్కాడని వారి కష్టాలు చెప్పలేనివి. వారికి వీలైనంత సాయం చేద్దాం.  అఫ్రిదీ ఫౌండేషన్‌కు నా మద్దతు ఉంటుంది. కరోనాపై పోరాటంలో అతడి ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. అఫ్రిది పౌండేషన్‌కు విరాళాలు ఇవ్వండి' అని యూవీ, భజ్జీ విజ్ఞప్తి చేశారు. 

ఆఫ్రిది ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వండి అంటూ పిలుపునివ్వడంపై యువీని కొందరు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేశారు. అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ ఆగ్రహం వ్య​క్తం చేశారు. భారత్‌లో ఏదైన సమస్య తలెత్తినప్పుడు పాక్‌ క్రికెటర్లు స్పందించే తీరు మర్చిపోయావా అంటూ కొందరు నెటిన్లు ప్రశ్నించారు. ఇక కరోనాపై తన పోరాటానికి మద్దతు తెలిపిన యువీ, భజ్జీలకు అఫ్రిది ధన్యవాదాలు తెలిపాడు. ‘మద్దతు తెలిపిన నా సోదరులు యువరాజ్‌, హర్భజన్‌కు ధన్యవాదాలు.  మీ మద్దతు వెలక​ట్టలేనిది. మన మధ్య ఉన్న ఈ బంధం మానవత్వం, ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని ప్రపంచానికి తెలుపుతుంది. యువరాజ్‌ ఫౌండేషన్‌ యూవీకెన్‌కు అభినందనుల’అంటూ ఆఫ్రిది ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. 

చదవండి:
ధోనికంటే ‘దాదా’నే నాకు గొప్ప! 
‘గంగూలీ కోసం లక్ష్మణ్‌ను తప్పించాను’

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా