ఇంట్లో వాళ్లు మొబైల్‌ బిల్‌ కట్టలేదు: యువీ

25 May, 2020 19:39 IST|Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ ‌సింగ్‌ తాజాగా ఓ సరదా ఫొటోను షేర్‌ చేశాడు. పెద్దగా సెల్‌ఫోన్లు అందుబాటులో లేని సమయంలో.. తన సహచరులతో కలిసి పబ్లిక్‌ టెలీఫోన్‌లో ఇంటికి కాల్‌ చేసి మాట్లాడుతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. సహచరులు వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, ఆశిష్‌ నెహ్రాతో ఉన్న ఆనాటి జ్ఞాపకాను గుర్తు చేశాడు. ఫోటోకు యువీ ఓ సరదా క్యాప్షన్‌ కూడా జత చేశాడు. ‘మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన  చేయడంతో ఇంట్లో వాళ్లు మా మొబైల్‌ బిల్స్‌ కట్టలేదు. దాంతో ఈ పరిస్థితి తలెత్తింది’అంటూ పేర్కొన్నాడు. సెల్‌ఫోన్లు లేని ఆ రోజులకు వెళ్దాం అంటూ రాసుకొచ్చాడు. 
(చదవండి: తప్పు నాదే మహా ప్రభో: యువీ)

ఇక ఈ ఫొటో 2001లో టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్లినప్పటిదిగా తెలుస్తోంది. న్యూజిలాండ్‌, శ్రీలంక, భారత్‌ మధ్య త్రైపాక్షిక వన్డే సిరీస్ జరిగింది. అనంతరం శ్రీలంకతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లో కూడా పాల్గొంది. రెండు సిరీస్‌లను సనత్‌ జయసూర్య సారథ్యంలోని ఆతిథ్య జట్టు గెలుచుకుంది. యువీ షేర్‌ చేసిన ఫొటోపై మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌.. ‘ఫ్రీ కాల్‌’అటూ కామెండ్‌ చేశాడు. ‘శ్రీలంక నుంచి భారత్‌కు కాలింగ్‌ కార్డు’అంటూ యువీ సమాధానం ఇచ్చాడు.
(చదవండి: జడేజాను అందుకోవడం కష్టం: రోడ్స్‌)

When your parents don’t pay your mobile phone bill after a bad performance 😆! #throwback to days without 📱😇 @rd.nehra @virendersehwag @vvslaxman281

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా