యువరాజ్‌ స్టన్నింగ్‌ క్యాచ్ చూశారా?

5 Aug, 2019 19:36 IST|Sakshi

ఒంటారియో: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినా తనలో సత్తా తగ్గలేదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ నిరూపిస్తున్నాడు. గ్లోబల్‌ టీ20 కెనడాలో టోరంటో నేషనల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యువీ మైదానంలో తనదైన శైలిలో అలరిస్తున్నాడు. బ్రాంప్టాన్‌ వాల్స్వ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ పట్టిన క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది. గార్డన్‌ బౌలింగ్‌లో సిమన్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను మూడు సార్లు ప్రయత్నించి ఒడిసిపట్టాడు. స్టన్నింగ్‌ క్యాచ్‌ అంటూ ఈ వీడియోను గ్లోబల్‌ టీ20 కెనడా అధికార ట్విటర్‌ పేజీలో షేర్‌ చేశారు.

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాణించి మునుపటి యువీన గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో టోరంటో నేషనల్స్‌ ఓడినప్పటికీ కెప్టెన్‌గా యువరాజ్‌ సత్తా చాటాడు. 22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. రెండు ఓవర్లు వేసి ఒక వికెట్‌ పడగొట్టాడు. అంతేకాదు షాహిద్‌ ఆఫ్రిదిని రనౌట్‌ చేయడంలోనూ కీలకపాత్ర పోషించి తనలోని సిసలైన ఆల్‌రౌండర్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చాడు. (చదవండి: యువీ మళ్లీ చెలరేగాడు.. కానీ)

మరిన్ని వార్తలు