నా బయోపిక్‌లో ఆయనే హీరో: యువరాజ్‌

17 Mar, 2020 14:41 IST|Sakshi

సినిమాల్లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంటుంది. ప్రస్తుతం సినిమాల్లో నడుస్తున్న ట్రెండ్ బయోపిక్స్. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇప్పుడు ఈ ట్రెండే నడుస్తుంది. ఫేమస్ పర్సనాలిటీల లైఫ్ స్టోరీలను తెరమీదకు తీసుకురావడానికి పోటీపడుతున్నారు. సినిమా స్టార్, బిజినెస్ మాన్, పొలిటీషియన్‌లతో పాటు క్రికెటర్ల లైఫ్ స్టోరీస్ కూడా బయోపిక్‌ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్‌ల బయోపిక్‌లు తెరకెక్కగా, ఇప్పుడు ఇండియన్ గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా రూపొందిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ కూడా తన బయోపిక్‌లో నటించే హీరో ఎవరో తెలియజేశారు. చదవండి: యువ కోచ్‌ను కబలించిన కరోనా

ఈ మధ్య ఓ ఇంటర్యూలో యువీ కూడా బయోపిక్‌పై మాట్లాడుతూ.. ‘వాస్తవానికి నా బయోపిక్‌లో నేనే నటిస్తాను. కానీ దీన్ని బాలీవుడ్ చిత్రంగా తెరకెక్కిస్తారు కనుక హీరోను డైరెక్టర్ సెలెక్ట్ చేస్తారు. నాకైతే సిద్దాంత్ చతుర్వేది మంచి ఆప్షన్. ‘గల్లీబాయ్' చిత్రంలో అతను చేసిన షేర్ పాత్ర అద్భుతంగా ఉంది. ఆ చిత్రంలో అతన్ని అలా చూడటం బాగా నచ్చింది' అని యువీ తెలిపారు. తన జీవితాన్ని తెరపై చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ‘గల్లీ బాయ్‌' చిత్రంతో సిద్ధాంత్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఐపీఎల్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్‌లో కూడా సిద్దాంత్ నటించారు. ఈ సిరీస్‌లో టీమిండియా వెటరన్ బౌలర్ శ్రీశాంత్‌ను పోలి ఉండే ప్రశాంత్ కనుజ పాత్ర పోషించారు. ఇది కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

కాగా.. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌‌లో ధోని సేన టైటిల్ నెగ్గడం‌లో కీలకపాత్ర పోషించారు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన యువరాజ్.. మళ్లీ బ్యాట్ పట్టి మెరుపులు మెరిపించారు. ఇలా భారత్ క్రికెట్‌లో తన ఆటతో అభిమానుల గుండెల్లో చెరుగని ముద్రవేసుకొని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. చదవండి: ప్రేక్షకులు లేకుండానే గ్రాండ్‌ప్రి ఈవెంట్‌లు 

మరిన్ని వార్తలు