నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?

6 Jul, 2020 12:25 IST|Sakshi

ముంబై: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ల స్నేహం గురించి తెలిసిందే. వీరు ఎప్పుడు చాట్‌ చేసినా అందులో అభిమానులకు కావాల్సినంత ఫన్‌ ఉంటుంది. ఇక్కడ రోహిత్‌ శర్మ కాస్త కూల్‌ ఉన్నప్పటికీ యువీ మాత్రం జోక్‌లతో ఆటపట్టిస్తూ ఉంటాడు. తాజాగా రోహిత్‌ శర్మ తన భార్య రితికాతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఒక రొమాంటిక్‌ ఫోటోను పోస్ట్‌ చేశాడు.ఇక్కడ మనకు ఫోటో రొమాంటిక్‌గా కనిపిస్తున్నప్పటికీ భార్యపై ఉన్న ప్రేమను రోహిత్‌ కనబరుస్తున్నాడనేది అది వ్యాఖ్యల ద్వారా అర్ధమైంది. (విరాట్‌ కోహ్లికి సరికొత్త తలపోటు)

‘ మీరు ప్రేమించే దానిని ఎప్పుడూ పట్టుకునే ఉండండి’ అని భార్యపై ప్రేమను వ్యక్తం చేశాడు రోహిత్‌. దీనికి యువరాజ్‌ కాస్త వెరైటీగా స్పందించాడు. ‘రోహిత్‌.. నీ బుగ్గలు అంటే నాకు ఇష్టం.. వాటిని పట్టుకోనా’ అని టీజ్‌ చేశాడు. దీనికి రితికా పర్మిషన్‌ తీసుకోవాలంటూ ఒక అభిమాని యువీకి కౌంటర్‌ వేశాడు. ఒకవైపు రోహిత్‌ తన భార్యతో ఉన్న ఫోటో వైరల్‌ కాగా, యువీ కామెడీ యాడ్‌ కావడం నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది.  ఇక గత మే నెల 1వ తేదీన యువీని రోహిత్‌ ఆట పట్టించిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్‌ 30వ తేదీన రోహిత్‌ 33వ బర్త్‌ డే సందర్భంగా అతనికి ప్రస్తుత జట్టులోని సహచరులు, మాజీ ప్లేయర్లు విషెస్‌ తెలిపారు. దీనికి రోహిత్‌ స్పందిస్తూ ‘ థాంక్యూ సో మచ్‌ గయ్స్‌.. కానీ యువీకి లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ బాగా తగిలినట్టు ఉంది. ఆ సెగ హెయిర్‌లోని కనిపిస్తోంది’ అని రోహిత్‌ సెటైర్‌ వేశాడు. ఇప్పుడు యువీ అదిరిపోయే పంచ్‌ ఇవ్వడంతో రోహిత్‌ ఏమి సమాధానం చెబుతాడో చూద్దాం.(హార్దిక్‌-కృనాల్‌ల ‘తొలి’ ఇంటర్వ్యూ చూశారా?)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు