విక్టరీ డ్యాన్స్‌: మైదానంలో చహల్‌, అయ్యర్‌ స్టెప్పులు

3 Feb, 2020 08:34 IST|Sakshi

మౌంట్‌మాంగని: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను‌ 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన తొలి జట్టుగా టీమిండియా కొత్త చరిత్ర సృష్టించిన వేళ... టీవీల ముందు కూర్చున్న అభిమానులే కాదు.. మైదానంలో ఆటగాళ్లు సైతం డ్యాన్సులతో ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. విదేశీ గడ్డపై భారత జట్టు టీ20 సిరీస్‌లను మూడోసారి వైట్‌వాష్‌ చేసిన సందర్భంగా... ఆటగాళ్లు యజువేంద్ర చహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్‌ జట్టు తన అధికారిక ఇన్‌స్టా అకౌంట్‌.. విక్టరీ డ్యాన్స్‌ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసింది. దీంతో వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

కాగా టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌ టూర్‌లో భాగంగా.. ఆట నుంచి విరామం దొరకగానే తోటి క్రికెటర్లతో కలిసి ఓ టిక్‌టాక్‌ వీడియో చేశాడు. ‘ఆఫ్‌ ఫీల్డ్‌ పెర్ఫార్మెన్స్‌’ అంటూ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోకు ఫ్యాన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఆ వీడియోలో యువ ఆటగాళ్లు చహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివం దూబేలతో పాటు క్యాప్‌ పెట్టుకుని.. ముఖం దాచుకున్న క్రికెటర్‌ను గుర్తుపట్టడం మాత్రం తమకు కష్టంగా మారిందంటూ కామెంట్లు చేశారు. (టీమిండియా కొత్త చరిత్ర: నెవర్‌ బిఫోర్‌... 5-0)

ఇక న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు సూపర్‌ విజయాలకు తోడు.. ఆదివారం నాడు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు టీ20 ఫార్మాట్‌లో కొత్త చరిత్ర సృష్టించి సత్తా చాటింది. సిరీస్‌ ఆసాంతం బ్యాటింగ్‌తో చెలరేగిన రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ .. తన పేస్‌ పదునుతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించిన బుమ్రాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’. అవార్డులు దక్కాయి. ఇదే జోష్‌లో కివీస్‌తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న హామిల్టన్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా.. న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Victory dance 🕺🕺

A post shared by Team India (@indiancricketteam) on

మరిన్ని వార్తలు