‘చాహల్‌ నిజంగా జెంటిల్‌మన్‌’

20 Sep, 2018 19:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌లో అద్బుతమైన ఆటతీరుతోనే కాదు.. మంచి మనసుతోనూ అభిమానుల హృదయాలు గెలుచుకోవచ్చని నిరూపించాడు టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌  యజువేంద్ర చాహల్‌‌. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌, కేదార్ జాదవ్‌లో పోటీ పడి వికెట్లు తీయలేకపోయిన ఒక సూపర్బ్‌ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్‌ మధ్యలో చాహల్‌ చూపిన క్రీడా స్పూర్తికి యావత్‌ క్రీడా అభిమానులు, నెటజన్లు ఫిదా అయ్యారు. పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్‌ 42.4 ఓవర్‌ బౌలింగ్‌ చేస్తున్న చాహల్‌ పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖాన్‌ షూ లేస్‌ కట్టి అతడికి సహాయం చేశాడు. 

ప్రస్తుతం చాహల్‌ పాక్‌ బ్యాట్స్‌మన్‌కు షూలేస్‌ కట్టిన ఫోటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లు చహల్‌ను అభినందిస్తున్నారు. క్రీడా స్పూర్తిని చాటిన మణికట్టు మాంత్రికుడు నిజంగా జెంటిల్‌మన్‌, హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఉన్న ఆటలో ఆటగాళ్లు క్రీడా స్పూర్తిని మరిచిపోకుండా ఆటలకు ఉన్న గౌరవాన్ని కాపాడారని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో చాంపియన్‌ ట్రోఫీలో పాక్‌పై టీమిండియాకు ఎదురైన పరాభవానికి ఈ విజయం కాస్త ఉపశమనం కలిగించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా