ఇది జహీర్‌ ఖాన్‌ వీర ప్రేమ కథ

24 Mar, 2018 18:22 IST|Sakshi
జహీర్ ఖాన్, సాగరిక ఘట్

ప్రేమ ఒక అనిర్వచితమైన అనుభూతి. దానికి మరింత బలం చేకూర్చేది పెళ్లి. ప్రతి ఒక్కరూ తమ పెళ్లికి దారి తీసిన సంఘటనలను మర్చిపోలేరు. అది సెలబ్రిటీలు అయినా సరే సామాన్యులు అయినా సరే. వారి పెళ్లి గురించి చెప్పమంటే మొదటగా సిగ్గు పడతారు. తర్వాత ఒక్కో విషయాన్ని సినిమా స్టోరీలా  వివరిస్తారు. తాజాగా ఓ సెలబ్రిటీ ప్రేమ జంట తమ లవ్‌ జర్నీని వీడియో తీసి రిలీజ్‌ చేసింది. ఆ ప్రేమ పక్షులు ఎవరో కాదు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్గేలు.

ఈ జంట పెళ్లి అయిన దగ్గర నుంచి అందరి చూపు వారిపైనే. వారు ఎటూ వెళ్లిన అందరూ ఓ లుక్కేస్తారు. దానికి కారణం అప్పట్లో వీరి లవ్‌ స్టోరి హాట్‌ టాపిక్‌గా మారడం. ఈ ప్రేమ పక్షులు వారి పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ వీడియో చేశారు. ఆ వీడియోలో ఇంట్లో వారి ప్రేమ విషయాన్ని చెప్పడానికి పడిన కష్టాలను వివరించారు.

వీడియోలో జహిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు సాగరిక ఏమి మారలేదు. నేను ప్రేమించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నేను మొదటగా మా ప్రేమ విషయాన్ని చెప్పడానికి సాగరిక వాళ్ల నాన్న దగ్గరకి వెళ్లాను. అంతకు ముందే నాకు వారి అమ్మతో పరిచయం ఉంది. దీంతో పెద్దగా భయపడలేదు. సాగరిక వాళ్ల నాన్నను తొలిసారి కలిసిప్పుడు15-20 నిమిషాలు మాట్లాడుతాడు అనుకున్నా, కానీ ఆయన నాతో మూడు గంటలపాటు మాట్లాడారు. అన్ని గంటలు అప్పటి పరిస్తితులపైనే మా చర్చ జరింది’ అని గుర్తుచేసుకుంటూ నవ్వేశాడు జహీర్‌ ఖాన్‌.

ఇక సాగరిక మాట్లాడుతూ.. ‘నేను మొదటగా జహీర్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లినప్పుడు కాస్త భయపడ్డాను. వారు చాలా గంభీరంగా ఉంటారు. మనం వారిని ఎంత గౌరవిస్తామో, వారు మనల్ని అంతకు మించి గౌరవిస్తారు. మనుషులు గంభీరం కానీ మనసులు మాత్రం మంచివి అని లవ్‌ స్టోరీ చెబుతూ సిగ్గు పడింది ఈ హిరోయిన్‌.

ఆ వీడియోకి సాగరిక ‘ఇది జహీర్‌ ఖాన్‌, సాగరికల లవ్‌ జర్నీ’  అని టైటిల్‌ కూడా పెట్టింది. కింది స్థాయి నుంచి కష్ట పడి వచ్చిన వాళ్లు నాకు ఎక్కువగా తెలియదు.  కానీ ఆ గుణం జహీర్‌లో చూశా. అందరూ జహీర్‌ను ఇష్ట పడుతారు దానికి కారణం అతను మంచి వాడు. అతను నాకు దొరకడం నిజంగా లక్కీ అని సెలవిచ్చింది ఈ బాలీవుడ​ నటి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా