'బౌలింగ్ కోచ్ గా చేయాలని ఉంది'

16 Oct, 2015 16:25 IST|Sakshi
'బౌలింగ్ కోచ్ గా చేయాలని ఉంది'

ముంబై: భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా చేయాలని ఉందంటూ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన జహీర్ ఖాన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇప్పటికే పుణేలో హోటల్ వ్యాపారంతో బిజిగా ఉన్న జహీర్.. ఫుడ్ అండ్ బేవరేజ్ సెక్టార్ లోకి అడుగుపెట్టే ఆలోచనలో నిమగ్నమయ్యాడు. కాగా, జాతీయ క్రికెట్ జట్టుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జహీర్.. టీమిండియాకు బౌలింగ్ కోచ్ గా చేయాలని ఉందని కూడా తెలిపాడు.

 

'భారత జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్ గా పనిచేయాలని ఉంది. ఈవిషయంలో చాలా ఓపెన్ గా ఉన్నాను. ఇప్పటికే నన్ను కలిసిన పలువురు బౌలర్లకు సలహాలు కూడా ఇస్తున్నాను. ప్రస్తుతానికి పెళ్లి, రాజకీయాలు అనే వాటి గురించి ఆలోచించడం లేదు(నవ్వుతూ).  రాబోవు రోజుల్లో నా నుంచి కొత్తగా ఏమైనా వినవచ్చు''అని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోనున్న విషయాన్ని ముందుగానే తన తల్లి దండ్రులతో పాటు, తన స్నేహితులైన సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లకు తెలిపినట్లు జహీర్ తెలిపాడు.  టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (311) తీసుకున్న నాలుగో బౌలర్ గా జహీర్ గుర్తింపు పొందాడు.

>
మరిన్ని వార్తలు