పారితోషకాల కోసం క్రికెటర్ల సమ్మె

12 Nov, 2014 20:24 IST|Sakshi
పారితోషకాల కోసం క్రికెటర్ల సమ్మె

అంతర్జాతీయ క్రికెట్లో మరో కుదుపు. నిన్నటికి మొన్న వెస్టిండీస్ క్రికెటర్లు బోర్డుతో గొడవపడి భారత పర్యటన నుంచి అర్థంతరంగా తప్పుకోగా.. తాజాగా జింబాబ్వే క్రికెటర్లు పారితోషకాల కోసం సమ్మెకు దిగారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తమకిచ్చే పారితోషకాలు ఏమాత్రం సరిపోవని ఆందోళన బాట పట్టారు. జీతాల్లో దాదాపు సగం పన్ను రూపంలో కోత పడుతోందని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఓ వైపు భారత క్రికెటర్లు వేతనాలతో పాటు ఐపీఎల్, వాణిజ్య ప్రకటనల రూపంలో కోట్లు సంపాదిస్తుంటే.. పాపం జింబాబ్వే క్రికెటర్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. భారత క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే సంపన్నమైనది కాగా, జింబాబ్వే, వెస్టిండీస్ వంటి బోర్డులు చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తుండటమే దీనికి కారణం.

>
మరిన్ని వార్తలు