ఆల్‌టైమ్‌ టీ20 రికార్డు బ్రేక్‌

21 Sep, 2019 10:05 IST|Sakshi
చివరి మ్యాచ్‌ ఆడేసిన మసకద్జకు ఘనమైన వీడ్కోలు

చిట్టగాంగ్‌: టి20ల్లో అఫ్గానిస్తాన్‌ 12 వరుస విజయాల ఆల్‌ టైమ్‌ రికార్డు జింబాబ్వే తెరదించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్లతో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్బాజ్‌ (47 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హజ్రతుల్లా జజాయ్‌ (31) అద్భుత ఆరంభాన్నిచ్చినా మిగతావారు విఫలమవడంతో అఫ్గాన్‌ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, పేసర్‌ ఎంపొఫు (4/30) ప్రత్యర్ధిని దెబ్బకొట్టాడు. కెప్టెన్‌ మసకద్జ (42 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో జింబాబ్వే 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 156 పరుగులు చేసి గెలిచింది. తన కెరీర్‌ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో మసకద్జ చెలరేగడం విశేషం. దాంతో పాటు జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించి తన వీడ్కోలుకు ఘనమైన ముగింపు  పలికాడు.

మరిన్ని వార్తలు