మండుతున్న ఎండలు– అల్లాడుతున్న ప్రజలు

25 Mar, 2018 15:00 IST|Sakshi
కొబ్బరిబొండంతో దాహార్తిని తీర్చుకుంటున్న  వాహనచోదకులు

ఎచ్చెర్ల : మార్చి నెల ప్రారంభమే నడినెత్తిన సూరీడు చుర్రు మంటున్నాడు. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండతీవ్రతతో పాటు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మండలంలో చెరువులు, బావులు, తాగునీటి బోర్లలో నీరు అడుగంటుతున్నాయి. భూగర్భజలాలు ఇంకిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు వేసవి తీవ్రతను తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శీతలపానీయాలు, కొబ్బరిబొండాలు, కర్భూజా పండ్లకు గిరాకీ ఏర్పడింది.

మరిన్ని వార్తలు