వావ్..ఊబ్లూ

17 Mar, 2018 07:44 IST|Sakshi

నెలసరిఖర్చులన్నీ  ఇంటికే

కొత్త ఆవిష్కరణలను నగరం ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంది. రోజుకో కొత్త యాప్‌ ఆవిష్కృతమై నగర ప్రజలకుపరిచయమవుతోంది. అయితే ఒక్కో యాప్‌ ఒక్కో సేవ అందిస్తున్నాయి. అందుకు కాస్త భిన్నంగాఅన్ని సేవలు ఒకే యాప్‌ ద్వారా అందిస్తామంటూ ‘ఊబ్లూ’ వచ్చేసింది. అర్జెంట్‌గా బయటకు వెళ్లేందుకు క్యాబ్‌ కావాలి.. బాగా ఆకలేస్తోంది..ఫుడ్‌ కావాలి. అర్జెంట్‌గా మెడిసిన్స్‌ అవసరం.. నోప్రాబ్లమ్‌.. అందుకోసం వివిధ యాప్‌లను వెతుక్కోవాల్సిన పనిలేకుండా ఊబ్లూ క్లిక్‌ చేస్తే చాలు ఎలాంటి సేవలైనా ‘నెట్‌’ ఇంట్లోంచి వచ్చి.. ఇంటి కాలింగ్‌ బెల్‌ కొట్టేలా చూస్తాం.. ముఖ్యంగావృద్ధులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ యాప్‌ రూపొందించామని ‘ఊబ్లూ’ సంస్థ నిర్వాహకులు శిరీష గొండి, రాహుల్‌ దేవరకొండ, లక్ష్మణ్‌సందీప్‌ చెబుతున్నారు.  

హిమాయత్‌నగర్‌: సైనిక్‌పురికి చెందిన శీరిష గొండి, రాహుల్‌ దేవరకొండ భార్యభర్తలు. లక్ష్మణ్‌సందీప్‌ శిరీష సోదరుడు. శిరీష, రాహుల్‌లు వృత్తిరీత్యా అమెరికాలో ఉండేవారు. అక్కడి నుంచి నిత్యం తల్లిదండ్రులతో ఫోన్లో మాటాడుతూ వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. ఈ సందర్భంగా ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా బయకు వెళ్లాల్సి వస్తోందని, కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తల్లిదండ్రులు వారితో చెప్పారు. దీంతో తమ తల్లిదండ్రుల్లా చాలా మంది ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలోంచి వచ్చిందే ‘ఊబ్లూ’..  

ఏంటీ ‘ఊబ్లూ’
‘ఊబ్లూ’ అనేది కార్టూన్‌ నెట్‌వర్క్‌ ఛానెల్‌లో ఓ ప్రోగ్రాంలో వచ్చే కాన్సెప్ట్‌ పేరు. ఎవరికి ఏ సాయం కావాలన్నా ఒక్క బటన్‌తో వారికి సాయం అందేలా ఆ ప్రోగ్రాంలో ఉంటుంది. దాని స్ఫూర్తితోనే ‘ఊబ్లూ’ అని నామకరణం చేశారు.  
 
సింబల్‌పై బటన్‌ నొక్కితే చాలు
గూగూల్‌ ప్లేస్టోర్‌ నుంచి ‘woobloo’ అనే యాప్‌ను ముందుగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ డౌన్‌లోడ్‌ అయ్యాక దానిలో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ‘ఆన్‌లైన్‌ షాపింగ్, ట్రైన్‌ బుకింగ్, మూవీ టికెట్స్, ఫుడ్‌ డెలివరీస్, బస్‌ బుకింగ్, గ్రాసరీస్, ఫ్లైట్‌ బుకింగ్, ఆన్‌ కాల్‌ డ్రైవర్, ఫార్మసీ, యుటిలిటీ బిల్‌ పేమెంట్, హోటల్‌ బుకింగ్‌ అనే సేవలు దర్శనమిస్తాయి. వీటిలో మనకు కావాల్సిన సేవపై క్లిక్‌ చేయగానే ‘ఊబ్లూ’కి కాల్‌ చేయాలా? అనే ఆప్షన్‌ ప్రత్యక్షమై ఐదు సెకన్ల సమయంతో టైమర్‌ ఆన్‌ అవుతుంది. మనకు ఓకే అనుకుంటే అలాగే ఉంచితే డైరెక్ట్‌గా ‘ఊబ్లూ్ల’కి కాల్‌ వెళ్తుంది. అక్కడ ఉండే పర్సనల్‌ అసిస్టెంట్‌ కాల్‌ని రిసీవ్‌ చేసుకుని జీపీఆర్‌ఎస్‌ సాయంతో మన అడ్రస్‌ను గుర్తిస్తారు. మనం కోరిన సాయాన్ని అందిస్తారు.

మొదటి నెల ఉచితం
ముందుగా రిజిష్టర్‌ చేసుకుని వాడుకుంటున్న వారికి మొదట నెల ఏ విధమైన సబ్‌స్క్రిప్షన్‌ లేకుండా ఫ్రీగా సేవలను అందిస్తారు. నెల ముగిసన తరువాత నుంచి వృద్ధులకు రూ.499, మిగితా వారికి రూ.699 చొప్పున ఛార్జి చేస్తారు.

ఫ్లైట్‌లో నచ్చిన సీటు
ఎక్కడి నుంచైనా ఫ్లైట్‌లో నచ్చిన సీటును బుక్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు ఫుడ్‌ని కూడా ఆర్డర్‌ చేసుకోచ్చు. విమానం టిక్కెట్‌ ధరతో సంబంధం లేకుండా నచ్చిన సీటు కావాలంటే టిక్కెట్‌ ధరపై మరో రూ.200, భోజనానికి రూ.250 చొప్పున అదనంగా డబ్బులు వసూలు చేస్తారు.

కిరాణా షాప్‌కి వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే పప్పులు, తాలింపుదినుసులు, చింతపండు, ఉప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులన్నీ ఈ యాప్‌ ద్వారా పొందవచ్చు. ముందుగా మనకు కావాల్సిన సరుకుల లిస్ట్‌ని ఒక పేపర్‌పై రాసుకోవాలి. తరువాత యాప్‌లో ఉన్న ‘గ్రాసరీస్‌’ ఆప్షన్‌ని క్లిక్‌చేస్తే కెమెరా, గ్యాలరీ అనే రెండు ఆప్షన్స్‌ వస్తాయి. మనం రాసుకున్న స్లిప్‌ గ్యాలరీలో ఉంటే దానిపై క్లిక్‌ చేస్తే వూబ్లూకి చేరుతుంది. ఆ సరుకులన్నీ ఇంటికి చేరుతాయి.  

త్వరలో ఈ సేవలు
వృద్ధులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన యాప్‌ ఇది. ఇందుకోసం 2వేల మంది వృద్ధులను కలిశాం. ప్రస్తుతం ఈ యాప్‌ ద్వారా 1,400మంది సేవలు పొందుతున్నారు. ఈ నెలఖరులోపు ‘గిఫ్టింగ్, ఫొటోగ్రఫీ, మెడికల్‌ ట్యాక్సీ’ వంటి సేవలను కూడా ప్రవేశపెట్టనున్నాం. వీటితో పాటు సబ్‌స్క్రైబర్స్‌కి కావాల్సిన సేవలను పొందుపరుస్తాం. ఒక్క క్లిక్‌తో సేవలన్నీ పొందవచ్చు.
    –శిరీష గొండి, రాహుల్‌ దేవరకొండ, లక్ష్మణ్‌సందీప్‌ 

మెడిసిన్స్‌పై 25శాతం డిస్కౌంట్‌
వైద్యుడు రాసిన మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ను ‘ఊబ్లూ’కి సెండ్‌ చేస్తే వారు నిర్ణీత సమయంలో ఆ మందులను ఇంటికి పంపిస్తారు. ఎన్ని మందులు తీసుకున్నా వాటిపై 25శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. 

బిల్స్‌ సేవ్‌ చేసుకోండి
వివిధ సమయాల్లో మన బిల్లులు ఎక్కడో మస్‌ అవుతుంటాయి. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు ఇబ్బంది పడుతుంటాం. షాపింగ్‌ చేసిన బిల్లులు, ఏటీఎం, క్రెడిట్‌ కార్డు స్లిప్పులు, ఇతర బిల్లులను ‘ఊబ్లూ’కి పంపిస్తే వాళ్లు అవి సిస్టంలో సేవ్‌ చేస్తారు. మనకు కావాల్సిన సమయంలో కాల్‌ చేసి అడిగితే ఆ బిల్స్‌ని తిరిగి పంపిస్తారు. ఇంట్లోని వస్తువులకు రిపేర్‌ వస్తే టెక్నిషియన్‌ని కూడా పంపిస్తారు. 

ఏ బిల్లునైనా చెల్లించుకోవచ్చు
కరెంట్, టెలిఫోన్, వాటర్‌బిల్, మొబైల్‌ బిల్‌ ఇలా ఏ బిల్లు కట్టాలన్నా సంబంధిత కార్యాలయం లేదా మీ సేవ–ఈ సేవలకు వెళ్లాల్సిందే. ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘వూబ్లూ’ యాప్‌ ద్వారా ఆ బిల్లులను సులభంగా చెల్లించుకోవచ్చు. 

మహిళ భద్రత కోసం
‘ఊబ్లూ’లో ‘ఎమర్జెన్సీ’ ఐకాన్‌ ఉంది. మహిళలు, యువతులు ఇబ్బందిలో ఉంటే హెల్ప్‌ చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ‘ఎమర్జెన్సీ’ బటన్‌పై క్లిక్‌ చేస్తే పోలీసులకు సమాచారం అందుతుంది. అంతేకాదు యాప్‌లో రిజిస్టర్‌ అయ్యే సమయంలో మనకు నచ్చిన వారి ఇద్దరి నంబర్లు ఇవ్వొచ్చు. పోలీసులతో పాటు వారిని అలర్ట్‌ చేస్తుంది. 

మరిన్ని వార్తలు