పరమ శివయ్య ఇకలేరు

12 Mar, 2014 01:47 IST|Sakshi

 ప్రముఖ నీరావరి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్ డాక్టర్ పరమశివయ్య (97) కన్నుమూశారు.  మంగళవారం ఉదయం 11.40  గంటలకు ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో తుమకూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన మరణవార్త తెలియగానే తుమకూరులోని పరమ శివయ్య స్వగృహానికి బంధువులు, వివిధ సంఘ సంస్థల నేతలు చేరుకున్నారు. అంతిమ దర్శనం చేసుకున్న వారిలో సిద్దగంగా మఠాధ్యక్షుడు శివకుమారస్వామిజీ, సిద్దలింగమహాస్వామీజీ, ఎంపీ జీఎస్.బసవరాజ్, విధానపరిషత్ సభ్యుడు డాక్టర్ ఎంఆర్ హులినాయ్కర్, ఎమ్మెల్యే డాక్టర్ రఫీక్ అహ్మద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.షఫీ అహ్మద్ .. ఉన్నారు.

నీరావరి పథకాలకు ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షుడిగా పరమ శివయ్య విధులు  నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపురం, కోలారు, బెంగళూరు గ్రామాంతర, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపురంతో పాటు తొమ్మిది జిల్లాలకు శాశ్వత నీటి సదుపాయం కల్పించడానికి పరమ శివయ్య ఓ నివేదికను తయారు చేసి 14 సంవత్సరాల కిందటే ప్రభుత్వానికి అందజేశారు. దాన్ని అమలు చేయాలంటూ నాటి నుంచి అనేక పోరాటాలు చేస్తూ బయలు సీమ జిల్లా ప్రజలకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు

మరిన్ని వార్తలు