గణేశ్ నిమజ్జనంలో అపశృతి

7 Sep, 2016 16:17 IST|Sakshi
అర్ధవీడు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఎగ్గెన్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జనంలో అపశృతి జరిగింది. స్థానిక ఎనమలేరు వాగులో గణేశుడి నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ రామయ్య(60) అనే వృద్ధుడు అదుపుతప్పి నీళ్లలో  పడిపోయాడు. తోటివారు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మృత దేహాన్ని వెలికి తీశారు. రామయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు. పండగ పూట ప్రమాదం జరగడంతో గ్రామలు విషాదఛాయలు అలుముకున్నాయి.
 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు