13 నుంచి బడ్జెట్ సమావేశాలు

17 Feb, 2015 01:34 IST|Sakshi

బెంగళూరు :  ఈ ఏడాది మార్చి 13 నుంచి 31 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. క్యాంపు కార్యాలయం కృష్ణాలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19 నుంచి బడ్జెట్ సన్నాహాక సమావేశాలు ఉంటాయన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో క్షుణ్ణంగా చర్చించి ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకుని బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.

గత బడ్జెట్‌లో సంక్షేమం కోసం రూ.65వేల కోట్లు  కేటాయించగా అందులోఇప్పటి వరకూ 60 శాతం ఖర్చు చేశామని మరో రెండు  మాసాలు సమయం ఉండటం వల్ల మిగిలిన మొత్తాన్ని కూడా వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. జేడీఎస్ పార్టీ నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అయితే ఈ స్థలానికి సంబంధించి కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని వాటిని జేడీఎస్ పార్టీనే పరిష్కరించుకోవాల్సి ఉందని అన్నారు.
 

మరిన్ని వార్తలు