సందీప్కుమార్కు జుడిషియల్ రిమాండ్

9 Sep, 2016 16:43 IST|Sakshi

న్యూఢిల్లీ: రేప్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్కు ఢిల్లీ కోర్టు 14 రోజులు జుడిషియల్ రిమాండ్కు ఆదేశించింది. సందీప్ కుమార్కు పోలీస్ కస్టడీ ముగియడంతో శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణలో భాగంగా సందీప్కు తదుపరి పోలీస్ కస్టడీ అవసరంలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. దీంతో ఈ నెల 23 వరకు సందీప్ను జుడిషియల్ రిమాండ్లో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సందీప్ కుమార్ ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పటి సీడీ వెలుగుచూడటంతో ఆయన పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు కోసం సందీప్ కార్యాలయానికి వెళ్లినపుడు మత్తమందు కలిపిన డ్రింక్ ఇచ్చి, తనపై అత్యాచారం చేశాడని సీడీలో ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు