కదిరి రథోత‍్సవంలో అపశ్రుతి

18 Mar, 2017 11:55 IST|Sakshi
- ఇద్దరికి గాయాలు
 
కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట‍్టణంలో శనివారం జరుగుతున‍్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత‍్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక‍్తులు అధిక సంఖ‍్యలో పాల‍్గొనడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఒక హోమ్‌గార్డుతో సహా మరో వ‍్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వారిని వెంటనే ఆస‍్పత్రికి తరలించారు.
 
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత‍్సవం కన్నులపండువగా ప్రారంభమైంది.  శ్రీదేవి, భూదేవి సమేతుడైన నృసింహుడికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేసిశోభాయమానంగా అలంకరించారు. స్వామివారి వూరేగింపునకు ముందు భక్తబృందాలు, భజనమండల్ల సభ్యులు ఆధ్యాత్మిక గీతాలాపన చేశారు. రథంపై కొలువుతీరిన  స్వామివారు నాలుగు మాడ వీధుల‍్లో తిరుగుతూ భక‍్తులను కటాక్షించారు. రథంపై దవనం మిరియాలు చల్లి భక‍్తులు మొక్కులు చెల్లించుకున‍్నారు. ఆంధ్రా, కర‍్ణాటక నుంచి లక్షలాది మంది భక‍్తులు పాల‍్గొన‍్నారు.
మరిన్ని వార్తలు