మిస్‌ ఇండియా–17 మనకే !

28 Feb, 2017 18:23 IST|Sakshi
► దక్షిణాది అమ్మయిలకే 
► అందాల కిరీటం 
► మిస్‌ దివా రోష్మిత జోస్యం  
యశ్వంతపుర:  మిస్‌ ఇండియా–2017 కిరీటాన్ని తమ దక్షిణాది రాష్ట్రాల అమ్మాయిలే కైవసం చేసుకుంటారని ‘2016 మిస్‌ దివా’ రోష్మిత హరిమూర్తి ధీమా వ్యక్తం చేళశారు. కలర్స్, ఫెమినామిస్‌ ఇండియా –2017 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. 
 
మార్చి నెల 5 వ తేదీన సౌత్‌జో¯ŒS క్రోనంగ్‌ కార్యక్రమాన్ని బెంగళూరులోని క్రౌన్ ప్లాజాలో నిర్వహిస్తున్నాట్లు తెలిపారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంపిౖకెన వారిలో ఐదుగురిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ముంబైలో జూన్ లో జరిగే గ్రాండ్‌ ఫైనల్స్‌లో వారు పాల్గొంటారని చెప్పారు. ఈ ఏడాది పోటీల్లో మన అమ్మాయిలలో ఒకరు అందాల కిరీటం సొంతం చేసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 

మరిన్ని వార్తలు