ఆయన జీవనశైలి విభిన్నం

6 Oct, 2018 12:17 IST|Sakshi
శిరోజాలతోనే తలపాగా ధరించిన పాలయ్య , పాలయ్య తలనీలాలను తాడులా పట్టుకున్న గ్రామస్తులు

90 సంవత్సరాలుగా తలనీలాలు తీయని వైనం  

21 అడుగులు పెరిగిన శిరోజాలు

సాక్షి,బళ్లారి: ఆయన జీవనశైలి ఎంతో విభిన్నం. ఆయన ఆధ్యాత్మికబాట మరింత విశిష్టం. 21 అడుగుల పొడవైన శిరోజాలతో ఆకట్టుకుంటూ   శ్రీశైల మల్లికార్జునస్వామిని కొలుస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నాడు. ఆయనే పాలయ్య.  చిత్రదుర్గం జిల్లా బి.జి.కెరె తాలూకా ముత్తిగారహళ్లి గ్రామానికి చెంది న పాలయ్య వృద్ధాప్యం మీద పడినా 21 అడుగుల పొడవుతో ఉన్న శిరోజాలతో ఆకట్టుకుంటున్నాడు. సాధారణంగా పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లిదండ్రులు తమ ఇష్టదైవానికి ఏడాదికో..రెండేళ్లకో..మూడేళ్లకో తలనీలాలు సమర్పిస్తారు. అయితే పాలయ్య అనే 90ఏళ్ల వృద్ధుడు పుట్టినప్పటినుంచి తలనీలాలు తీయలేదు. పాలయ్య పూర్వీకులు ›గ్రామంలోని శ్రీ శైల మల్లికార్జున స్వామికి వదిలిన ఎద్దులను కా యడం వృత్తిగా సాగిస్తుండేవారు.  గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు శ్రీశైల మల్లికార్జున స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు దూడగా ఉన్నప్పుడే ఎద్దులను స్వామి పేరుతో ఆ గ్రామంలో వదిలివెళతారు.

భక్తులు వదిలి వెళ్లిన ఎద్దులను సంరక్షించడం పాలయ్య కుటుంబీలకు సంప్రదాయంగా మారింది. స్వామివారి ఎద్దులను ఆలనాపాలన చూసే కుటుంబాలకు గ్రామంలో ఎంతో గౌరవం ఉంటుంది. పాలయ్య తనకు బుద్ధి వచ్చినప్పటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామికి వదిలిన ఎద్దులను సంరక్షిస్తున్నాడు. ఈక్రమంలో తలనీలాలు కూడా తీయించుకోలేదు. జీవితాంతం   తలనీలాలు తీయించుకోకూడదని శపథం పూనా రు. ప్రస్తుతం ఆయన వయస్సు 90 సంవత్సరాలు. తలనీలాలు 21 అడుగులకు పైగా పెరిగాయి. తన కు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా తలస్నానం కూడా చేయక పోవడం విశేషం. శిరోజాలనే తలపాగాగా చుట్టుకొని తన విధుల్లో నిమగ్నమవుతాడు.  ఆయనకు భార్య, ఐదుగురు కుమారులు, కుమార్తె, మనవళ్లు, మునిమనవళ్లు ఉన్నారు. పాలయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ  పాలయ్య శ్రీశైల మల్లికార్జున స్వామికి పరమభక్తుడని,  తలస్నానం కూడా చేయరని, తల వెంట్రుకలను  తలపాగాగా అందంగా చుట్టుకుంటారన్నారు.

మరిన్ని వార్తలు