సప్తస్వరాలు పలికే బండరాయి లభ్యం

21 Jul, 2018 07:45 IST|Sakshi
లభ్యమైన సప్తస్వరాల బండరాయి

అన్నానగర్‌: అంజెట్టి సమీపంలో గురువారం 2,500 ఏళ్లనాటి సప్తస్వరాలు పలికే బండరాయి లభించింది. కృష్ణగిరి జిల్లా చరిత్ర పరిశోధన కేంద్రానికి చెందిన పురావస్తుశాఖ పరిశీలనదారుడు పరంధామన్, అన్భరసన్, సుగవనమురుగన్‌ అంజెట్టి సమీపం, మిలిదికిలో పరిశోధనలు చేశారు. దాదాపు 2,500 సంవత్సరాల క్రితం రాతియుగానికి చెందిన సప్తస్వరాలను పలికే బండరాయిని కనుగొన్నారు. ఇది 4 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, సుమారు రెండు టన్నుల బరువు ఉంది. ఈ బండరాయి సుమారు 30 టన్నుల బరువున్న మరో బండరాయిపై లభించిందని సుగవణమురుగన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు