మంజీరానదిలో చిక్కుకున్న 27 మంది కార్మికులు..

24 Sep, 2016 13:03 IST|Sakshi
పాపన్నపేట: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల్లోని ఓ గడ్డపై శనివారం ఉదయం 27 మంది భవన నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు.

మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఏడుపాయలు దాటుతుండగా.. ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకున్నారు. మంజీరా ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో వారిని వీలైనంత త్వరగా రక్షించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. కార్మికులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. 

కూలీలను రక్షించే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. హెలికాప్టర్లను రప్పించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాలన్న ప్రయత్నం వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్లను రప్పించటం ఇబ్బందిగా మారడంతో సహాయక చర్యలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆపివేశారు. ఇదిలా ఉండగా, ఏడుపాయల వద్ద వరద ఉధృతి మరింత పెరగడం ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని వార్తలు