40 కి.మీ ట్రాఫిక్ జామ్

11 Jun, 2016 08:33 IST|Sakshi
40 కి.మీ ట్రాఫిక్ జామ్

ముంబై: దేశంలో అత్యంత రద్దీగా ఉండే హైవేల్లో ముంబై, అహ్మదాబాద్లను కలిపే ఎన్హెచ్ 8 ఒకటి. మూడు రోజులుగా ఈ రోడ్డుపై విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైవేపై 40 కిలో మీటర్ల మేర ట్రాఫ్ జామ్ కాగా, 20 వేల వాహనాలు ట్రాఫిక్లో ఇరుకున్నాయి.

ఈ హైవేపై వడోదర, సూరత్ నగరాలను కలిపే సర్దార్ బ్రిడ్జ్ వద్ద.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. దీంతో వడోదర వైపు 15 కి.మీ, సూరత్ వెళ్లే వైపు 25 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. 20 నుంచి 25 కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి గంటలకొద్దీ సమయం పడుతోంది. కార్లు, మోటార్ సైకిళ్లు వంటి చిన్న వాహనదారులు ఈ హైవే నుంచి టర్న్ తీసుకుని వేరే రోడ్డు ద్వారా వెళుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అక్కడ 150 మంది పోలీసులను, ఇద్దరు అధికారులను నియమించారు. ముంబై-అహ్మదాబాద్ హైవే వస్తు రవాణాకు చాలా కీలకమైనది. ఇక్కడ టెక్స్టైల్స్, ఫార్మాసూటికల్స్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్, పెట్రో కెమికల్స్ తదితర పరిశ్రమలున్నాయి.

మరిన్ని వార్తలు