బీజేపీలో చేరిన ఏడుగురు కౌన్సిలర్లు

1 Aug, 2013 00:00 IST|Sakshi

 బీజేపీ ఢి ల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్, ఢిల్లీ ప్రదేశ్ కో-ఇన్‌చార్జి నవజ్యోత్ సింగ్ సిద్ధు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా చేరిన కౌన్సిలర్లకు విజయ్‌గోయల్ ఆహ్వానం పలికారు. కొత్తగా చేరిన ఏడుగురు కౌన్సిలర్లలో ఐదుగురు స్వతంత్య్ర అభ్యర్థులుకాగా, మిగిలిన ఇద్దరిలో ఒకరు బీఎస్పీ, ఒకరు జేడీయూ నుంచి ఉన్నారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన కౌన్సిలర్లు మాట్లాడుతూ..ఢిల్లీవాసులు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయారన్నారు. వచ్చే విధాన సభ ఎన్నిలకల్లో బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బీజేపీలో చేరడం ఆనందగా ఉందని వారు పేర్కొన్నారు. గోయల్ మాట్లాడుతూ..ఢిల్లీవాసులంతా కాంగ్రెస్ సర్కార్‌ను పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. విధానసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 కొత్తగా చేరిన కౌన్సిలర్లు వీరే...
 సురేశ్‌గార్గ్ (వార్డు నం-61, త్రినగర్, స్వతంత్య్ర అభ్యర్థి), నరేశ్ బల్‌యాన్(వార్డు నం-126, నవాడా, స్వతంత్య్ర),ప్రదీప్ కుమార్ (వార్డు నం-133, స్వతంత్య్ర), క్రిష్ణకుమార్ షెహ్రావత్(వార్డు నం-144, మహిపాల్‌పురా), ప్రమోద్‌తన్వర్ (వార్డునం-152, నరైనా,స్వతంత్య్ర),రాహుల్ ప్రద్యుయాల్ సాయి(బీఎస్పీ,వార్డు నం-39,సుల్తాన్ మాజ్రా),చంద్రప్రకాశ్ (జేడీయూ,వార్డునం-195,గోవింద్‌పురి)
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు