-

ఆప్ నేత ఆశిష్ కేతన్ మరోసారి క్షమాపణ

6 Jul, 2016 17:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆశిష్ కేతన్ మరోసారి క్షమాపణ చెప్పారు. ఆప్ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆయన సిక్కుల పవిత్ర గ్రంథం  గురు గ్రంథ్ సాహిబ్‌తో పోల్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆశిష్ కేతన్ మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై నిన్నే క్షమాపణ చెప్పానని, అయితే మళ్లీ సారీ చెబుతున్నానన్నారు.  ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదనీ, అలాగే  ఎవరి మనోభావాలను కించపరచలేదని అన్నారు.

కాగా మతవిశ్వాసాలను దెబ్బతీసేలా అశిష్ కేతన్ వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై అమృత్సర్లో కేసు నమోదు అయింది. సిక్క్ స్టూడెంట్ ఫెడరేషన్ నేత కర్నైల్ సింగ్ పీర్ మొహమద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే  మత మనోభావాలు దెబ్బతీసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రావాల్ క్షమాపణ చెప్పాలని పీర్ మొహమద్ ...ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆప్ నేతలు క్షమాపణ చెబితే సరిపోదని, కేజ్రీవాల్ స్వయంగా క్షమాపణ చెప్పాలని సిక్కు సంస్థలు స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు