అల్కా లంబా అధికార ప్రతినిధి హోదాపై వేటు

16 Jun, 2016 10:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎమ్మెల్యే అల్కా లంబా అధికార ప్రతినిధి హోదాపై ఆమ్ ఆద్మీ పార్టీ రెండు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధికార పార్టీ ప్రతినిధి హోదా నుంచి ఆమెను రెండు నెలలపాటు తప్పిస్తూ ఆప్  గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రవాణా శాఖమంత్రి పదవి నుంచి గోపాల్ రాయ్ తప్పుకున్న నేపథ్యంలో రిలీవ్ అయ్యారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇక తన సస్పెన్షన్పై అల్కా లంబా స్పందిస్తూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఒకవేళ తెలియక తప్పుగా మాట్లాడి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటానని ఆమె ట్విట్ చేశారు. కాగా ఢిల్లీ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ రెండు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అనారోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. దీంతో గోపాల్ రాయ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో మంత్రి సత్యేంద్ర జైన్‌కు అప్పగించారు. కాగా బస్సుల కుంభకోణంలో గోపాల్‌ రాయ్‌ పై ఆరోపణలు రాగా దీనిపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు