ఆప్ మహిళా ఎమ్మెల్యేపై దాడి

10 Aug, 2015 03:39 IST|Sakshi
ఆప్ మహిళా ఎమ్మెల్యేపై దాడి

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నాయకురాలు, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. మాదక ద్రవ్యాల్ని నిరోధించాలని పిలుపునిస్తూ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే చేపట్టిన ప్రత్యేక ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.

ర్యాలీ.. ఉత్తర ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతానికి చేరుకోగానే గుర్తుతెలియని దుండగులు ఎమ్మెల్యే అల్కా సహా ఆమె అనుచరులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో అల్కా తలకు బలమైన గాయం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా స్పందించిన కార్యకర్తలు అల్కాను హుటాహుటిన అరుణా అసఫ్ అలీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కొద్దిసేపటికి ఆమె డిశ్చార్జి అయ్యారు.

 'మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాపై దాడి చేశారు. నా తల పగలగొట్టారు. రక్తం కళ్లజూశారు. అయినాసరే వెనకడుగు వేసేదిలేదు. మత్తులో జోగుతున్నవారిని జాగృతం చేసేవరకు పోరాడుతూనే ఉంటా' అని దాడి అనంతరం అల్కా ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు