‘తారాంగణి ఇంగేనియా’లో యోగేష్ సందడి

29 Jan, 2014 01:56 IST|Sakshi

 సాక్షి, బెంగళూరు : ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు యోగేష్ విద్యార్థులతో కలిసి స్టెప్పులేశారు. వెండితెరపైనే కాదు వేదికపై కూడా తాను అదరగొట్టే డ్యాన్సులు చేయగలనంటూ నిరూపించాడు. నగరంలోని మహారాణి లక్ష్మీ అమ్మణ్ణ కళాశాలలో ‘తారాంగణి ఇంగేనియా-2014’ పేరిట నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్‌లో యోగేష్ పాల్గొన్నారు. ఈ కల్చరల్ ఫెస్ట్‌లో కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ అభిమాన నటుడు యోగేష్‌ను చూడగానే ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు