సాహసనారి వసుంధర

26 Sep, 2015 02:45 IST|Sakshi
సాహసనారి వసుంధర

 బుద్ధన్ ఏసు గాంధీ చిత్రం కోసం నటి వసుంధర బైక్‌పై స్వారీ చేయడం, కారు వేగంగా నడపడం వంటి పలు సాహసాలు చేస్తున్నారట. ఆ వివరాలేమిటో చూద్దాం. బ్లెసింగ్ ఎంటర్‌టెయినర్స్ పతాకంపై ప్రభాతీస్ సామువేల్ నిర్మిస్తున్న చిత్రం బుద్ధన్ ఏసు గాంధీ. వెట్రివేల్ చంద్రశేఖర్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నటి వసుంధర ప్రధాన పాత్రలో క్రైమ్ రిపోర్టర్‌గా నటిస్తున్నారు.ఆ వివరాలను దర్శకుడు తెలుపుతూ రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాలను సేకరించి పత్రికలో ప్రచరించే ధైర్యవంతురాలైన యువతిగా నటి వసుంధర నటిస్తున్నారని తెలిపారు.
 
 ఈ పాత్ర కోసం ఆమె మోటార్ బైక్‌పై స్వారీ, వేగంగా కారు నడపడం వంటి సాహసోపేతమైన సన్నివేశాల్లో నటిస్తున్నారని చెప్పారు. విషయం ఏమిటంటే వ సుంధరకు అసలు బైక్ నడపడం రాదన్నారు. చిత్ర యూనిట్ ఆమెకు బైక్ నడపడంలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. రోజూ అన్నానగర్ నుంచి కోయంబేడు, వడపళని, మధురవాయిల్ ప్రధాన రోడ్లపై వసుంధరకు బైక్ నడపడంలో శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇందులో కిషోర్, అశోక్, కయల్ విన్సెంట్, కల్లారి అఖిల్  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని వెల్లడించారు. చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా