'సినీ పరిశ్రమకు వచ్చి తప్పు చేశాను'

10 Mar, 2014 14:39 IST|Sakshi
'సినీ పరిశ్రమకు వచ్చి తప్పు చేశాను'

బెంగళూరు : 'సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే చిత్రరంగంలోకి  ఎందుకొచ్చానా అని బాధపడుతున్నాను' అని నటి వింద్య అన్నారు. జీవితంపై విరక్తి చెందిన ఆమె అధిక మోతాదులో షుగర్ మాత్రలు మింగి  ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దాంతో వింద్యను కుటుంబ సభ్యులు బౌరింగ్ ఆస్పత్రిలో చేర్పించారు.  ఆరోగ్యం కుదుటపడటంతో ఆమెను వైద్యులు ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

అనంతరం వింద్య తన తల్లిదండ్రులతో కలిసి మాగడి రోడ్డులోని అగ్రహారలోని ఉన్న తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఇకపై తన తల్లిదండ్రులను బాధించే పనులు చేయనని, వారికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటానని అన్నారు. అయితే తన ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులపై మాట్లాడేందుకు మాత్రం ఆమె నిరాకరించారు.

కాగా వింద్య స్నేహితుడు మంజునాథ్ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి ఒడిగొట్టిందని వింద్య తల్లిదండ్రులు రంగస్వామి, నాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మనెదమరయల్లి అనే కన్నడ సినిమాలో వింద్య  హీరోయిన్‌గా చేసింది. అదే సినిమాకు అసిసెంట్ డెరైక్టర్‌గా మంజునాథ్ పనిచేశారు. ఈ సందర్భంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని సమాచారం.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు