తల్లిదండ్రుల కోసం.. ఇరవై ఏళ్ల తరువాత ఇండియాకు

20 Mar, 2019 13:12 IST|Sakshi
లక్ష్మణ్‌తో నీల్స్‌ట్రెండ్‌

నాలుగేళ్ల వయసులో నెదర్లాండ్‌ కుటుంబం దత్తత

చెన్నైలో తల్లిదండ్రుల కోసం యువకుడి అన్వేషణ

టీ.నగర్‌: నాలుగేళ్ల వయసులో నెదర్లాండ్‌ కుటుంబానికి దత్తత వెళ్లిన యువకుడు ప్రస్తుతం తన తల్లిదండ్రుల కోసం చెన్నైలో అన్వేషిస్తున్నాడు. ఇందుకు అతని పెంపుడు తల్లి, సోదరుడు సహకరిస్తున్నారు. వివరాలు.. చెన్నై తిరువేర్కాడు శ్రీ షణ్ముగనగర్‌లోగల అనాథాశ్రమంలో 20 ఏళ్ల క్రితం నెదర్లాండ్‌కు చెందిన జూరీ ట్రెండ్, విల్మానెయిస్ట్‌ దంపతులు నాలుగేళ్ల వయసున్న లక్ష్మణ్‌ను దత్తత తీసుకుని తమతో పాటు తీసుకెళ్లారు. వీరికి ఇది వరకే నీల్స్‌ ట్రెండ్‌ అనే కుమారుడు ఉన్నాడు.

గత 20 ఏళ్లుగా నెదర్లాండ్‌లో ఉంటున్న లక్ష్మణ్‌కు తన అసలైన తల్లిదండ్రులను చూడాలన్న ఆశ కలిగింది. దీంతో అతను పెంపుడు తల్లిదండ్రులకు తన కోరిక తెలపడంతో వారు సమ్మతించారు. జూరి ట్రెండ్‌ తన భార్య, కుమారుడితో ఈనెల ఐదో తేదీన లక్ష్మణ్‌ను భారత్‌కు పంపాడు. కొన్ని రోజుల క్రితం చెన్నై చేరుకున్న వారు లక్ష్మణ్‌ తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. దీనిగురించి చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలోను, రాష్ట్ర క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోలోను వారు పిటిషన్‌ అందజేశారు. లక్ష్మణ్‌ నెదర్లాండ్‌లోని ఒక సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నాడు.

మరిన్ని వార్తలు