ఇరకాటంలో గౌతమి

11 Dec, 2016 02:48 IST|Sakshi
ఇరకాటంలో గౌతమి

ఎదురుదాడిలో అన్నాడీఎంకే
కుట్ర సాగుతున్నదని ఆగ్రహం
అమ్ముడుపోయారని ఆరోపణలు


సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన  సినీ నటి గౌతమిని ఇరకాటంలో పెట్టే రీతిలో ఎదురుదాడిలో అన్నాడీఎంకే వర్గాలు నిమగ్నం అయ్యాయి. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా కుట్ర సాగుతున్నదని, ఇందులో భాగంగానే కుట్రదారులకు గౌతమి అమ్ముడుపోయారంటూ ఆరోపణల్ని సంధించే పనిలో పడ్డారు. అందరి అమ్మ జయలలిత  భౌతికంగా అందర్నీ వీడినా, ఆమెను, ఆమె సేవలు, పథకాలను  ప్రజాహృద యం నుంచి ఎవరూ తొలగించలేరు. తమ కుటుంబంలో ఓ పెద్దగా అమ్మ పేరును స్మరించే వాళ్లు కోట్లల్లో ఉన్నా రు. ఆ అమ్మ   ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ కోట్ల  గుండెలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావమ్మా..? అని మొక్కని దే వుళ్లంటూ లేరు.

అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో త మ ముందుకు వచ్చేస్తారని  ఎదురుచూసి, చివరకు గుండె లు బరువెక్కాయి. అమ్మ మరణ సమాచారం శోక సంద్రం లో ముంచింది. భౌతికంగా అమ్మ అందర్నీ వీడి వారం రోజులు కావస్తున్నది. ఈ సమయంలో శుక్రవారం నటి గౌతమి వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాల్ని ఆందోళనలో పడేశాయి. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, వచ్చేస్తున్నారని, ఆందోళన వద్దని పదే పదే భరోసా ఇచ్చి, చివరకు అమ్మ లేదన్న సమాచారం ప్రజల్లోకి పంపడాన్ని ఎత్తి చూపుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి గౌతమి లేఖ రాసిన విషయం తె లిసిందే.

అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, గోప్యం ఎందుకో అని, ప్రజాగుండెల్లో మెదులుతున్న అ నుమానాలకు సమాధానం ఇవ్వాలంటూ ఎంతో ధైర్యంగా ఆమె ప్రశ్నించారు. అయితే, ఆ  ప్రశ్నలకు సమాధానంగా అన్నాడీఎంకే వర్గాలు ఎదురుదాడికి దిగే పనిలో పడ్డాయి. గౌతమిని ఇరకాటంలో పెట్టే రీతిలో వ్యాఖ్యల తూటాల్ని సంధించే పనిలో పడ్డారు.

ఎదురుదాడి: గౌతమి సంధించిన ప్రశ్నలను ఎత్తి చూపుతూ అన్నాడీఎంకే వర్గాలు ఎదురుదాడికి దిగడమే కాకుండా, పార్టీలో ప్రకంపనలకు సాగుతున్న కుట్రకు గౌతమి సహకరిస్తున్నట్టుగా, అమ్ముడుపోయినట్టుగా ఆరోపణలుగుప్పించే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి నాంజిల్‌ సంపత్‌ మీడియాతో మాట్లాడుతూ, గౌతమి ప్రశ్నల్ని తీవ్రంగానే ఖండించారు. ప్రపం చ స్థాయి వైద్యాన్ని అమ్మకు వైద్యులు అందించారన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. అమ్మ అనుమతి ఇస్తేనే, ఇతరులు లోనికి వెళ్లగలరన్న విషయాన్నీ గౌతమి పరిగణించాలని హితవు పలికారు. హద్దులు మీరి వ్యాఖ్యలు సంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పార్టీలో చీలిక లక్ష్యంగా సాగుతున్న కుట్రలో భాగంగానే గౌతమి ప్రశ్నలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుట్రకు ఆమె అమ్ముడు పోయారేమోనని ఆరోపించారు.

మరో అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి పేర్కొంటూ, అన్నాడీఎంకే వర్గాలు తప్పుడు సమాచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్టుగా గౌతమి అనుమానాలు వ్యక్తం చేస్తుండటం శోచనీయమని విమర్శించారు. తామే కాదు, జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల నాయకులు అమ్మను పరామర్శించేందుకు వచ్చి, ఆమె ఆరోగ్యంగా ఉన్నారని మీడియా ముందు వ్యాఖ్యలు చేసి వెళ్లిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. అర్థరహిత అనుమానాలను మానుకుంటే మంచిదని హెచ్చరించారు.

ఇక, ఆ పార్టీ మరో అధికార ప్రతినిధి దీరన్, మాజీ మంత్రి వలర్మతి, సీనియర్‌ నేత బన్రూటి రామచంద్రన్‌ తదితరులు గౌతమి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎదురు దాడికి దిగడం గమనార్హం. ఇక, అన్నాడీఎంకే వర్గాలు గౌతిమి మీద ఎదురుదాడికి దిగితే, ఆమె వ్యాఖ్యలను నటుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌ సమర్థించడం విశేషం. ప్రజల మదిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడీఎంకే వర్గాలకు హితబోధ చేసే పనిలో పడ్డారు.

అంత మర్యాద ఎందుకో: దివంగత సీఎం జయలలిత మరణంపై గౌతమి అనుమానాలను వ్యక్తం చేస్తే, నెచ్చెలి శశికళకు ఎందుకు అంత ప్రాధాన్యతో అంటూ పీఎంకే నేత రాందాసు పెదవి విప్పే పనిలో పడ్డారు. సీఎం పన్నీరు సెల్వంతో పాటుగా అధికార వర్గాలు శశికళ చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నారో అని ప్రశ్నించారు. ఏ పదవిలోనూ లేని ఆమెకు  ఎందుకు ఇంత ప్రాధాన్యతను ఇస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. సీఎం పన్నీరు సెల్వం ఇకనైనా ప్రజల పక్షాన నిలబడి తన బాధ్యతల్ని నిర్వర్తించే విధంగా ముందుకు సాగాలని కోరారు. అంతే గానీ,  భేటీలు అంటూ తమరితో పాటుగా అధికార వర్గాలు పోయెస్‌ గార్డెన్‌వైపుగా ఉరకలు తీయడానికి ఇకనైనా స్వస్తి పలకాలని హితవు పలికారు. కాగా, చిన్నమ్మకు జిందాబాద్‌ అన్నట్టుగా ముందుకు సాగుతున్న అన్నాడీ ఎంకే వర్గాలు, ఇక, రాందాసు వ్యాఖ్యలపై  ఏ మేరకు ఘాటుగా స్పందించబోతున్నారో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు