వాళ్లను కూడా వదలని 'అమ్మ'

6 Feb, 2016 17:45 IST|Sakshi
వాళ్లను కూడా వదలని 'అమ్మ'

కోయంబత్తూర్: 'అమ్మ' నూతన వధూవరులను కూడా వదలటం లేదు. ఏకంగా వారి నుదుటిపైనే నిలిచింది.  అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ ఫార్మసి, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, అమ్మ ఆముదం, అమ్మ అవార్డులు, అమ్మ థియేటర్. ఇలా అనేక పథకాలు  ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి ప్రారంభించించినవే. తాజాగా ఈ జాబితాలో వివాహాలు కూడా చేరాయి. పెళ్లిల్లో కూడా ఇప్పుడు జయలలిత ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అది కూడా వధూవరుల నదుటిపై ఉంచిన బాసికాలపై.

జయలలితను ఆమె అభిమానులు 'అమ్మ'గా ఆరాధించే సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరి 24న జయలలిత 68వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. దీంతో పురచ్చి తలైవీ పుట్టినరోజు వేడుకలను  అభిమానులు శుక్రవారం నుంచే ప్రారంభించారు. దీనిలో భాగంగా కోయంబత్తూర్‌లోని ఉడుమలైపెట్టైలో 68 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అమ్మ హాజరు వ్యక్తిగతంగా కాలేకపోయినా... పెళ్లికూతురు, పెళ్లికొడుకు నుదిటి కట్టిన బాసికాల నుంచి ఆశీర్వదిస్తారని జయలలిత అభిమానులు అంటున్నారు. కాగా, వధూవరుల నుదుటిపై ఉన్న బాసికాలపైనే కాకుండా, వారి చేతుల్లో ఉన్న బొకెలతో పాటుగా, ఈ కార్యక్రమం నిర్వహించిన వేదిక పరిసరాల్లో మొత్తం అమ్మ ఫోటోలతో నిండిపోయాయి.

మరిన్ని వార్తలు