విశాలాక్షికి కన్నీటి వీడ్కోలు

16 Nov, 2016 03:57 IST|Sakshi

కరుణ సంతాపం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సీనియర్ మహిళా నేత, పార్టీ నిర్వాహక కార్యదర్శి విశాలాక్షి నెడుంజెలియన్(93) భౌతిక కాయానికి మంగళవారం అంత్యక్రియలు జరిగారుు. అన్నాడీ వర్గాలు, ఆప్తులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. సీనియర్ నేతగా ఉన్న దివంగత వీ ఆర్ నెడుంజెలియన్ సతీమణి విశాలాక్షి అన్న విషయం అందరికీ తెలిసిందే. నెడుంజెలియన్ మరణానంతరం అన్నాడీఎంకేలో కీలక పాత్ర ను ఆమె పోషిస్తూ వచ్చారు. పార్టీ నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చిన ఆమె సోమవారం అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతి సమాచారంతో అన్నాడీఎంకే వర్గాలు చెన్నై ఆళ్వార్ పేటలోని ఇంటికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇక, సీఎం జయలలిత స్వయంగా తనను ఫోన్ ద్వారా పరామర్శించినట్టుగా విశాలక్షి కుమారుడు మదివానన్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆమె మరణ సమాచారంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి , కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సంతాపం తెలియజేశారు. నెడుంజెలియన్ సేవల్ని వివరిస్తూ, విశాలక్ష్మి నెడుంజెలియన్ ఆత్మకు శాంతి కల్గాలని ప్రార్థించారు. ఇక, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, అధికార ప్రతినిధి పొన్నయ్య ఆమె ఇంటి వద్దే ఉండి, అంత్యక్రియలకు తగ్గ ఏర్పాట్లను పర్యవేక్షించారని చెప్పవచ్చు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆళ్వార్‌పేట సీతమ్మ కాలనీలోని ఇంటి నుంచి విశాలక్షి భౌతిక కాయాన్ని ఊరేగింపుగా బీసెంట్‌నగర్ స్మశాన వాటికకు తీసుకొచ్చారు. పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే వర్గాలు, కుటుంబీకులు, ఆప్తులు తరలివచ్చారు. అక్కడి విద్యుత్ దహన వాటికలో ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగారుు.

మరిన్ని వార్తలు