జేఎన్‌యూలో ఏఐఎస్‌ఏ క్లీన్‌స్వీప్

14 Sep, 2014 23:26 IST|Sakshi
జేఎన్‌యూలో ఏఐఎస్‌ఏ క్లీన్‌స్వీప్

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెం ట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) విజయఢంకా మోగించింది. శుక్రవారం జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఏఐఎస్‌ఏ, ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ,ఎల్‌పీఎఫ్ తరఫున అభ్యర్థులు పోటీపడ్డారు. ఎన్నిక జరిగిన ప్రధాన నాలుగు పోస్టులనూ ఏఐఎస్‌ఏ గెలుచుకుంది. అధ్యక్షుడిగా పోటీచేసిన అశ్‌తోష్ కుమార్ (ఏఐఎస్‌ఏ)కు 1,386 ఓట్లు పోలయ్యాయి. ఎల్‌పీఎఫ్ తరఫున పోటీచేసిన రహీలా పర్వీన్  (377 ఓట్ల తేడా) రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
 
 అలాగే ఉపాధ్యక్షుడిగా అనంత్‌ప్రకాష్ (ఏఐఎస్‌ఏ) తన సమీప ప్రత్యర్థి మహ్మద్ జహిదుల్ దేవన్(ఏబీవీపీ)పై 600 ఓట్ల తేడాతో గెలిచాడు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం జరిగిన పోరులో చింటు కుమారి (ఏఐఎస్‌ఏ), తన సమీప ప్రత్యర్థి ఆశిష్‌కుమార్ ధనోటియా (ఏబీవీపీ)పై 814 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.  సంయుక్త కార్యదర్శిగా ఏఐఎస్‌ఏకు చెందిన షఫ్కత్ హుస్సేన్, తన సమీప ప్రత్యర్థి ములాయంసింగ్(ఎల్‌పీఎఫ్)పై 240 ఓట్ల తేడా తో విజయం చేజిక్కించుకున్నారు. గత ఏడాది కూడా జేఎన్‌యూ ఎన్నికల్లో ఏఐఎస్‌ఏ అన్ని పదవులను కైవశం చేసుకున్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు