భార్య దర్శకత్వంలో మరోసారి

2 Nov, 2014 01:49 IST|Sakshi
భార్య దర్శకత్వంలో మరోసారి

 నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో మరోసారి  నటించనున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ పెద్దకుమార్తె, ధనుష్ భార్య అయిన ఐశ్వర్య తొలిసారిగా మెగాఫోన్ పట్టి తన భర్త హీరోగా ‘3’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. నటి శ్రుతిహాసన్ హీరోయిన్‌గా తొలి తమిళ చిత్రం ఇదే. అనిరుధ్ సంగీ తాన్ని అందించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించక పోయినా అందులోని వై దిస్ కొల్లవెరి డీ పాట ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కొంచెం గ్యాప్ తర్వాత ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వై రాజా వై’. యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాఆనంద్ హీరోయిన్‌గా నటిస్తుంది. చిత్ర కథను మలుపు తిప్పే ముఖ్య భూమికను నటుడు ధనుష్ పోషించనున్నారన్నది తాజా వార్త. ఈ క్యామియో పాత్ర పోషించాలని ఐశ్వర్య తన భర్త ధనుష్‌ను కోరగా అందుకాయన ఓకే చెప్పారట. ఈ పాత్ర చిత్రీకరణ త్వరలో నిర్వహించనున్నట్లు తెలిసింది.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు